ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు రైల్వే కోడూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు శనివారం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా సుదర్శన్ శర్మ మాట్లాడుతూ.. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని పరిపాలన అద్భుతంగా చేశారని అన్నారు. 1940 నుండి 1950 వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారని ఆయన అన్నారు. టంగుటూరి సేవలు మరుపురానివి మరవరానివి అన్నారు.