వృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం సైబరాబాద్ సీపీ అవినాష్య మహంతి ఆదేశాల మేరకు బాలానగర్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 65 ఏళ్ల సరికొండ భ్రమరాంబ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సీఐ నరసింహారాజు ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా అర్థం చేశారు. ఇకపై వృద్ధులు, దివ్యాంగులు స్టేషన్లకు వెళ్లకుండానే ఎఫ్ఐఆర్ కాపీలు ఇంటికే చేరుస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల సేవపై భ్రమరాంబ కృతజ్ఞతలు తెలిపారు.