పల్నాడు జిల్లాలో అత్యధిక వర్షపాతం క్రోసూరు మండలంలో 167 మిల్లీమీటర్లు నమోదయింది. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అధికారులు తెలిపిన వివరాల మేరకు గడచిన 24 గంటల్లో 3408.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. గురజాలలో 165, అమరావతిలో 166, మాచవరంలో 166, సత్తనపల్లి లో 144, నరసరావుపేటలో 121, రాజుపాలెంలో 143, బెల్లంకొండ లో 144 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.