మొగల్తూరు నడివీధి ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 1:30కు ఆమె ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని, పోలీసులకు సహకరించాలని కోరారు. సీఐ యాదగిరి, ఎస్ఐ వాసు ఉన్నారు.