కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేలా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు. సోమవారం కోవూరు పంచాయతీలోని పెల్లకూరుకాలనీలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారికి