నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న 62 మంది సురక్షితంగా విశాఖ విమానాశ్రయానికి గురువారం రాత్రికి చేరుకున్నారు. వారికి స్వయంగా స్వాగతం పలికేందుకు ఎంపీ శ్రీ భరత్ తో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాసరావు విమానాశ్రయానికి వెళ్లారు. విమానాశ్రయానికి చేరుకున్న వారిలో విశాఖ పరిసర ప్రాంతాల వారికి కార్లు క్యాబ్లు ఏర్పాటు చేయగా దూరపు ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి ఫ్లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశ విదేశాలలో ఎక్కడ తెలుగువారి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వారిగా భావించి వారికి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు