ఉయ్యూరులో రైతుల బాధలు అర్థం చేసుకొని సకాలంలో యూరియా సరఫరా చేయాలని పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఊయ్యురు ఆర్డీఓ కార్యాలయంలో రైతులకు సకాలంలో యూరియా అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో వైఫల్యం చెందిందని, గత వైసిపి ప్రభుత్వంలో రైతుకు పుష్కలంగా యూరియా అందిందని తెలిపారు.