ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా గణేష్ మండపాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంవిపి పోలీస్ స్టేషన్ కు సంబంధించి సిఐ మురళి తెలియజేశారు. శుక్రవారం ఆయన పలు సూచనలు చేస్తూ మీడియాతో మాట్లాడారు. మండపాలు ఏర్పాటు చేయాలనుకునే వారు కచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాలని, పోలీసులు పరిశీలన చేసి దానికి అనుమతి ఇస్తారని తెలిపారు. దీనికోసం ఎలాంటి చలానాలు కట్టాల్సిన అవసరం లేదన్నారు.