అల్వాల్ లోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నూతనంగా 12 మందితో పునరుద్ధరణ కమిటీని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నియమించారు. వారికి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కె మోహన్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య చైర్మన్ రాజా సంజయ్ గోపాల్, ఆలయ ఈవో ఎం వీరేశం తదితరులు పాల్గొన్నారు.