రైలులో చోరీలకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జీఆర్పీ సీఐ జేవీ రమణ వివరాలు తెలిపారు. నిందితుడు గుజరాత్కు చెందిన ఓ ప్రయాణికుడి బంగారు ఆభరణాల బ్యాగును దొంగిలించాడని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి, అతడి నుంచి రూ.8 లక్షల విలువైన ఆభరణాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.