గోపాలపురం మండలం వాదాల కుంటలో పేకాట ఆడుతున్నారని సమాచారంతో శనివారం పోలీసులు దాడులు చేయగా, ఏడుగురు పట్టుబడ్డారు , వారి వద్ద నుంచి 50 వేల 170 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు గోపాలపురం ఎస్సై మనోహర్ తెలిపారు. గ్రామాల్లో పేకాట, కోడిపందాలు వంటి జుద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.