రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లోని టెక్స్టైల్ పార్కు గేటు ముందు సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కు కార్మికులు శనివారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు అవసరానికి కూలి సమస్యను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె నేటికీ ఐదవ రోజుకు చేరుకోగా ఐదవ రోజు పార్కు గేటు ముందు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.