Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
క్రీడలు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, జాతీయ క్రీడా దినోత్సవ ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని దేశ వ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక