ఆళ్లగడ్డలో ఆదివారం సాయంత్రం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం నృత్యాల నడుమ గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. ముందుగా గణేశ్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో అమ్మవారి శాలలో కొలువైన విగ్రహానికి విశేష పూజలు చేశారు. గౌరవాధ్యక్షుడు టీఎంసీ వేణుగోపాల్, న్యాయవాది నీలకంఠేశ్వరం, భాస్కర్ రెడ్డి, పలుకూరు సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.