సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని జోగిపేట మున్సిపల్ డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు మంగళవారం నాడు రచ్చ రచ్చ చేశారు.ఇండ్లలో లేని వారికి ఎంక్వయిరీ చేసి నోటీసులు ఇచ్చారని మున్సిపల్ అధికారులపై వాపోయారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టి అనంతరం ఆర్డిఓ పాండుకు వినతి పత్రం అందజేశారు. మేము అక్కడే ఉంటున్న మేము పనులకు వెళ్లిన సమయంలో వచ్చి కక్ష సాధింపుతో అధికారులు నోటీసులు ఇచ్చారని డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇచ్చిన నోటీసుల వెనక్కి తీసుకోవాలని డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డిమాండ్ చేశారు