అభివృద్ధి కోసం రైల్వే కోడూరు నియోజవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. రైల్వేకోడూరు మండలం లోని బొజ్జవారిపల్లి పంచాయతీ, దాదివారిపల్లి గ్రామం నందు ఆదివారం వైఎస్ఆర్సిపి నేతలు టిడిపిలో చేరే కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నందలూరు సుబ్రమణ్యం రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముక్కా రూపానంద రెడ్డి వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.