రేణిగుంటలో సింగిల్ విండో ఛైర్మన్ ప్రమాణ స్వీకారం రేణిగుంట MPDO కార్యాలయ ఆవరణంలో సింగిల్ విండో ఛైర్మన్ భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. భాస్కర్ రెడ్డి 30 ఏళ్లుగా TDPకి చేసిన సేవలను సీఎం గుర్తించి గౌరవించినట్లు తెలిపారు. రైతులకు ఎకరాకు రూ.3.87 లక్షల రుణాలు, విత్తనాలు, ఎరువులు అందిస్తామన్నారు. రూ.14.5 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు.