సింహాచలంలో బుధవారం జరిగే చందనోత్సవానికి మీడియా పాస్ లు ఇవ్వలేదంటూ సింహాచలం కార్యనిర్వహణ అధికారి కార్యాలయం ముందు జర్నలిస్టులు నిరసన తెలిపారు. కవరేజ్ కు వచ్చే మీడియా ప్రతినిధులకు పాసుల జారీ చేయడంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లకు, స్నేహితులకు అడ్డదారిలో స్వామి వారి దర్శనం పాసులు జారీ చేసారని అంటున్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి నిత్యం సింహాచలం దేవస్థానంలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు కవరేజ్ పాసులు ఇవ్వాలని జర్నలిస్టు లు డిమాండ్ చేస్తున్నారు. మీడియా ప్రతినిధులను దేవస్థానం అధికారులు చిన్నచూపు చూస్తున్నారని వాపోతున్నారు.