నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఆదివారం సంగారెడ్డిలో 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా క్రీడ అభివృద్ధి అధికారి కాసిం భేగ్ జెండా ఊపి ఈ రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేషనల్ స్పోర్ట్స్ డే ప్రాముఖ్యతను తెలియజేస్తూ, క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల నాయకులు, పీడీలు పాల్గొన్నారు.