ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బైకు ఢీకొన్న సంఘటనలు గనివినిపాడు గ్రామపంచాయతీ సెక్రటరీ మల్లికార్జునరావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు పొదిలి వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. అది శనివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.