అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కేశపురం పంచాయతీ పరిధిలోని దేవలంపేట వద్ద శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న అనాధ మహిళ మరియమ్మను గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లి పోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చిన్నమండెం పోలీసులు వెల్లడించారు.