గన్ పార్కులో కల్లుగీత వృత్తిరక్షణ హామీల అమలు కోసం తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని చేతి వృత్తిదారులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ముదిరాజులకు చేపలు యాదవులకు గొర్రెలు ఇవ్వాలని అన్నారు. కల్లు దుకాణాలపై దాడులు నిషేధించాలని తెలిపారు.