యానాం సమీపంలోని దరియాలతిప్ప వద్ద సముద్ర తీరంలోని గోదావరి నదిలో మంగళవారం మరోసారి గ్యాస్ లీకేజీ సమస్య తలెత్తింది. ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల పైపైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు స్థానికులు గుర్తించారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై అధికారులతో చర్చించినప్పటికీ సమస్య కు పరిష్కారం లభించలేదు.