ఉమ్మడి కర్నూలు జిల్లాల ఎంపీల భేటీ..ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీలు కర్నూలు నగరంలో భేటీ అయ్యారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటు తాజాగా జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు సమావేశంలో ప్రధానాంశమయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయంపై ఇద్దరు ఎంపీలు సవివరంగా చర్చించారు. రాధాకృష్ణన్ విజయం రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలో కూడా రాజకీయ పరిస్థితుల