44వ జాతీయ రహదారి పై బోల్తా పడిన కంటైనర్, తప్పిన ప్రమాదం అతివేగంగా వచ్చిన ఒక కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ లారీ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్ లో మంగళవారం సాయంత్రం అదుపుతప్పి రోడ్డు కింద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భారీ క్రేన్లు ఏర్పాటు చేసి కంటైనర్ లారీని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.