ఎస్ కోట మండలం బౌడార లో నిరసన శిబిరం వద్ద జిందాల్ నిర్వాసితులతో కలసి శనివారం మధ్యాహ్నం సమావేశమైన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ లు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. జిందాల్ నిర్వాసితులకు భూములు వెంటనే తిరిగి ఇవ్వాలని, జిందాల్ నిర్వాసితులకు గనుక న్యాయం జరగకపోతే జీవో 14 కు జిందాల్ నిర్మాణ స్వీతులతో పాటు తాటిపూడి ఆయకట్టు రైతులతో కలసి ఉమ్మడిగా సదస్సు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తెలిపారు.