రాష్ట్రంలో అటవీ సంపదను పెంచేందుకు కోటి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనంతపురం నగరంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువత ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందించడమే లక్ష్యమని కొనియాడారు.