కాకినాడ జిల్లా కుమ్మరిలోవ తపోవన ఆశ్రమంలో పదివేల కొబ్బరికాయలతో గణపతి రూపాన్ని తీర్చిదిద్ది పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ. గణేష్ చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు సరస్వతి స్వామీజీ వెల్లడించారు. వేద విద్యార్థులు వేద పండితులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించగా స్వామీజీ మంగళహారతులు సమర్పించారు