నాదేశ క్షేమం కోసం 5వేల మందితో సంఘమిత్ర సేవా సైన్యం తయారు చేసి ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని సంఘమిత్ర సూరిబాబు పేర్కొన్నారు. శనివారం రాత్రి పౌరగ్రంధాలయంలో సంఘ మిత్ర సూరిబాబు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహణ సాధించిన విజయాలు భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో సూరిబాబు మాట్లాడుతూ 22 ఏళ్లుగా ఏ ఒక్కరి వద్ద రూపాయి ఆశించకుండా 18 రకాల సేవా కార్యక్రమాలు నిర్వ హించడం జరుగు తుందన్నారు దేశ ప్రజలకు కొంచమైనా తన వంతు మంచి చేయాలనే సంకల్పం తో ఈ నా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు రూపాయికే విద్య అందిస్తున్నట్లు తెలిపారు.