హుజరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంన్చార్జి ప్రణవ్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం పై నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని రోగుల బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ నారాయన రెడ్డికి సూచించారు.