వైరా నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణపతి విగ్రహాలను ఆకర్షనీయమైన బొమ్మలు కలర్స్ తో తయారుచేసి విగ్రహాలను విక్రయించేందుకు నిర్వాహకులు సిద్ధం చేశారు. గణపతి నవరాత్రులకు రకరకాల రూపాల్లో గణనాధుడు విగ్రహాలను తయారు చేశారు. మధిర రోడ్డు లో వ్యవసాయ మార్కెట్ సమీ పంలో రామాంజనేయులు అనే విగ్రహాల తయారీ నిర్వాహకులు రాజస్థాన్ నుంచి తెప్పించిన రకరకాల పరికరాలతో ఆకర్షనీయంగా గణపతి విగ్రహాలను తయారు చేశారు గణపతి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన స్థానిక ప్రజలు మూడు రోజులు ముందుగానే గణపతి విగ్రహాలను కొనుగోలు చేశారు .