సత్యవేడు: జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు డీఎస్సీ మెరిట్ జాబితాలో సత్యవేడు మండలం నీలి తొట్టి కండిగ గ్రామానికి చెందిన అభ్యర్థి ఎస్ విజయ్ స్కూల్ అసిస్టెంట్( తెలుగు)లో జిల్లాలోని మొదటి ర్యాంకు సాధించారు. 87.01907 మార్కులతో విజయ్ మొదటి స్థానంలో నిలిచారు. నీలితొట్టికండ్రిగ గ్రామానికి చెందిన ఎస్ కిష్టయ్య, కుమారి దంపతుల కుమారుడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలు రాశారు.