పారిశుద్ధ కార్మికుని ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగ జ్యోతి అన్నారు. నేడు గురువారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ములుగు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... చనిపోయిన మహేష్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, తన ముగ్గురు పిల్లలకు చదువుకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.