గూడూరు పట్టణంలో శనివారం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మొదటి విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో రైతన్నలకు ఇచ్చిన హామీలో భాగంగా మొదటి విడత కింద రూ 7 వేలు జమ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు పింఛన్ పెంచారని, దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. రైతులకు ఆయన మెగా చెక్కు అందించారు.