రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వం కొన్ని ఫ్రీ బస్సు సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయినవిల్లి మండలం అయినవిల్లిలో గురువారం సాయంత్రం బస్సు ఎక్కే క్రమంలో మహిళల మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది. మహిళా ప్రయాణికులు ఎక్కువ మంది అక్కడకు చేరుకోవడంతో బస్సు ఎక్కే క్రమంలో తోపులాట జరిగింది. మహిళలకు మరిన్ని బస్సులు పెంచాలని ప్రయాణికులు కోరారు.