కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బుధవారం నన్నూరు టోల్‌గేట్ సమీపంలోని రాగమయూరి వద్ద ఏర్పాటు చేస్తున్న పార్కింగ్, హెలిప్యాడ్, సభా ప్రాంగణాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఆయనతో పాటు సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.