ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో సుబ్బాయమ్మ అనే మహిళ అనుమానాస్పద మృతి చెందింది. శనివారం ఇంట్లో యధావిధిగా నిదురించిన సుబ్బాయమ్మ ఆదివారం మృతి చెంది ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. ఇంటిలోని వస్తువులు చెల్లాచెదరుగా పడి ఉండడంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సుబ్బాయమ్మ వడ్డీలకు డబ్బులు తిప్పుతున్న క్రమంలో ఇటీవల కొంతమందితో గొడవ అయినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించి సుబ్బాయమ్మ మృతిని హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులకు తీసుకొని విచారిస్తున్నారు.