అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా పుల్లంపేట మండలం దలవాయిలపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు సోమవారం వినూతనంగా పలకల తో అక్షరాలు రాసి ప్రదర్శించారు. ఉపాధ్యాయుడు రమణ మాట్లాడుతూ... నిరక్షరాస్యులు అక్షరాలుగా నేర్పించడానికి విద్యార్థులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మనిషి ఎదుగుదలకు విద్య ఒక్క మూల స్తంభం అని, ప్రపంచ నలుమూలల అక్షరాస్యత వెలుగును తెలపడం ఈనాటి ముఖ్య ఉద్దేశం అన్నారు.