తవణంపల్లి మండలంలో మామిడి రైతులు శనివారం ఆందోళనకు దిగారు. మామిడి గుజ్జు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న రైతులు మామిడి కిలోపై కనీసం రూ.8 చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం గిట్టుబాటు ధర అందడం లేదని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ధర్నా నిర్వహించి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.