అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణం వద్ద పాము కలకలం రేపింది. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న చిల్లర కొట్టు సమీపంలోకి పాము దూరింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు కేకలు వేయడంతో నిర్వాహకురాలు భయభ్రాంతులకు గురైంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఆ పామును చంపేశారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.