ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందించిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, పలువురు అధికారులు పాల్గొన్నారు.