కర్నూలు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఇంటిపై ఏసీబీ సోదాలు కర్నూలు జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తులు కట్టబెట్టినట్టుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. సమాచారం మేరకు ఏసీబీ అధికారులు కర్నూలు కార్మిక శాఖ కార్యాలయాన్ని మూసివేసి సోదాలు కొనసాగిస్తున్నారు. కర్నూలుతో పాటు తిరుపతి, మదనపల్లి, రాయచోటి తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. కర్నూలులో ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. బాలు నాయక్ గతంలో తిరుపతిలో పనిచేసి ప్రస్తుతం కర్నూలులో ఏవోగా (జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసు) విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ దాడులు ప్రారంభించాయి. ఇంట్లో లభించిన వివరాలను అధికారులు ఇంకా ప్రకటించాల్సి ఉంది.