కడప జిల్లా కమలాపురం మండలం సి.గోపులాపురం గ్రామంలో గత కొన్ని రోజులుగా ముస్లిం కాలనీకి నీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. గురువారం స్థానికులు నీటి కష్టాలను ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి ఆయన నిమ్మకాయల బాలిరెడ్డి, సగిలి శివరామిరెడ్డిలను సమస్యను తీర్చాలని ఆదేశించడంతో వారు నీటి సౌకర్యాన్ని పునరుద్దరించారు. పంచాయతీకి ఎటువంటి నిధులు లేకపోయినా తమ సొంత నిధులతో నీటి సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యేకి, స్థానిక నాయకులకు స్థానిక కృతజ్ఞతలు తెలిపారు.