విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి, అమరులైన నాయకులు త్యాగాలు వృదా కాకుండా ఉండాలంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడు కోవడం అందరి భాద్యతగా ఉండాలని సిపిఎం జిల్లా నాయకులు డీ అప్పలరాజు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎక్షప్రేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్( ఇ ఓ ఐ)పేరుతో స్టీల్ ప్లాంట్ లో వివిధ యూనిట్లను ముక్కలుగా చేసి అమ్మకానికి పెట్టిందని దీనిని ప్రజలందరూ అడ్డుకునే విధంగా పోరాటంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ పీఎంపాలెం ప్రాంతంలో గాయత్రి నగర్, ఎస్ సి కాలనీ, లక్ష్మివాని పాలెం తదితర ప్రాంతాలలో శనివారం పాదయాత్రను చేపట్టారు.