సెప్టెంబర్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలని దివ్యాంగుల స్థానిక సంస్థలో వికలాంగుల ప్రాతినిధ్య సాధన కమిటీ చైర్మన్ షఫీ అహ్మద్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు కలిసి వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. దివ్యాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.