కొరిశపాడు గ్రామంలో మనమిత్ర సర్వీసెస్ పై ఉపయోగాలపై శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ రాజ్యలక్ష్మి పాల్గొని మనమిత్ర సర్వీసెస్ జరుగుతున్న తీరును పరిశీలించారు. మనమిత్ర లో మొత్తం ఏడు సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. కరెంట్ బిల్లుల దగ్గర నుంచి పథకాల వరకు సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఎండిఓ తెలియజేశారు.