భారీ వర్షాల నేపథ్యంలో పారిశుధ్యం,అత్యవసర మరమ్మత్తు పనులను తక్షణమే చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం రెబ్బెన మండలం ఎన్.టి.ఆర్. కాలనీని తహసిల్దార్ సూర్యప్రకాష్ తో కలిసి సందర్శించి వర్షం కురిసినప్పుడు వరద నీరు కాలనీలోకి చేరుతున్న ప్రదేశాలను, వరద పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షం కురిసినప్పుడు కాలనీలో నిర్మించిన మురుగు కాలువలలో ఇలాంటి కూడిక లేకుండా శుభ్రపరచాలని, ఎక్కడ మరమ్మత్తు పనులు చేపడితే కాలనీలోకి వరద నీరు రాకుండా ఉంటుందో గుర్తించి అత్యవసరంగా పనులు చేపట్టాలని తెలిపారు.