పల్నాడు జిల్లా వినుకొండ ఎంపీడీవో కార్యాలయం వద్ద మహిళలు తమ పెన్షన్లు నిలిపివేత పై శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఒక కన్ను లోపం ఉన్న తమకు గతంలో పెన్షన్లు వచ్చేవని అయితే తాజా వెరిఫికేషన్ లో వికలాంగుల శాతం తగ్గించి సెప్టెంబర్ నుంచి పెన్షన్లు ఇవ్వమని నోటీసులు జారీ చేశారని వారు వాపోయారు. ఈ నిర్ణయం తమకు అన్యాయం చేస్తుందని అధికారులు జోక్యం చేసుకోవాలని వారు కోరారు.