నిషేధిత పాలథీన్ కవర్లను వినియోగిస్తే ఊరుకునేది లేదని మున్సిపల్ శానెటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శుక్రవారం మెయిన్ రోడ్ లోని పలు దుకాణాలను సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు దుకాణాలలో నిషేధిత పాలథీన్ కవర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని, వ్యాపారులను తీవ్రంగా మందలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరీమాన విధిస్తామని హెచ్చరించారు. అలాగే చెత్తలను, వ్యర్ధాలను రోడ్లపైన, మురుగు కాలువలలో పోస్తే సహించేది లేదని విధిగా పారిశుద్ధ్య కార్మికులకు అందివ్వాలని స్పష్టం చేశారు