ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని గురుకుల పాఠశాలలో గురువారం 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని లైజాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఎనిమిదవ తరగతి పాఠంశానికి చెందిన ఓ ప్రాజెక్టు వర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు కొట్టడంతో మనస్థాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది. కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విద్యార్థినీని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థినికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.